కాంగ్రెస్‌ ఎమ్‌పి అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను

Apr 21,2024 22:07

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  విజయనగరం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనును ఆ పార్టీ అధిష్టానం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఎఐసిసి జనరల్‌ సెక్రెటరీ కెసి వేణుగోపాల్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం బిజెపిలో జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్న శ్రీను కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థిగా సీటును దక్కించుకోవడం గమనార్హం. బిజెపి పార్టీకి రాజీనామా ఇచ్చినట్లు గాని, అటు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు గాని జిల్లా నాయకులకు తెలియదని అంటున్నారు.

➡️