పేదలకు వరం సిఎం సహాయనిధి

Feb 24,2024 15:49 #Annamayya district, #cm founds

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : సిఎం సహాయనిధి పేదలకు వరమని ఏపీఐఐసి డైరెక్టర్‌ తంబెల్ల వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన కోడూరు శివ కుటుంబానికి వేణుగోపాల్‌ రెడ్డి శనివారం తన కార్యాలయంలో రూ.17 లక్షలు సిఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. సీతారామపురం హరిజనవాడకు చెందిన కోడూరు శివ కుమారుడు మంజునాధ్‌ గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతుండడంతో కాలేయ మార్పిడికిగాను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.17 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, జెడ్పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్‌ తంబెల్ల వేణుగోపాల్‌ రెడ్డికి బాధితుడి తండి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.శీను, శివ తదితరులు పాల్గొన్నారు.

➡️