సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఆదర్శనీయం

Dec 6,2023 16:06 #Konaseema
br ambedkar death anniversay in ambajipeta

ప్రజాశక్తి – అంబాజీపేట : భారతీయ సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని ఎంఈఓ -1 కాండ్రేగుల వెంకటేశ్వరరావు అన్నారు. అంబాజీపేట మండల విద్యా వనరుల కేంద్రం వద్ద బుధవారం అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఈఓ-2 మోకా ప్రకాష్ మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు, వ్యక్తిత్వం, విద్యతోనే గుర్తింపునిస్తాయని డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం సూచించిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దేందుకు కృషి చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ యూనియన్ నాయకులు ఎన్.ఎస్. ప్రకాశరావు, పి.నారాయణమూర్తి, బి.వి.గంగాధరం,పి.శ్రీనివాసరావు, జి.రాంబాబు, వి.సత్యనారాయణ, మరియు ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.

➡️