ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి

Dec 6,2023 15:20 #Tirupati district
br ambedkar death anniversay in pakala

ప్రజాశక్తి-పాకాల : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని మంగళవారం మండలంలోని పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కెవిపిఎస్ చంద్రగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో మండల కే వి పి ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండలంలో పెన్షనర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొగురాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబరు 6న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67 వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అన్నారు. అంబేద్కర్ అందరికీ సమాన విద్య,ఆరోగ్యం,ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమ సమాజనిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించారని తెలిపారు.

➡️