బుర్రకథ కళాకారిణి లక్ష్మి మృతి

Jan 6,2024 15:11 #Kakinada

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం గౌరీ కోనేరు వీధికి చెందిన కనకం లక్ష్మి(70) శనివారం మృతి చెందారు. ఆమె 40 సంవత్సరాల పాటు బుర్రకథ కళారూపంలో ప్రధాన కథకురాలిగా తన భర్త సూరిబాబుతో కలిసి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె మృతికి ప్రజానాట్య మండలి కళాకారులు దారపు రెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, దారపురెడ్డి సత్యనారాయణ, మహాపాతిన రాంబాబు, గరగపాటి పెంటయ్య, కుంచే అచ్చారావు, కేదారి నాగు, మంతెన సత్తిబాబు, పట్టణ కళాకారులు ఆనెం సత్యనారాయణ, ఎంఎస్‌ వర్మ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

➡️