ప్రశాంతంగా పాలిసెట్‌ పరీక్ష

Apr 27,2024 21:24

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఎపి పాలి సెట్‌ ప్రవేశ పరీక్ష స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రశాంతంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.ఎం.వి.నారాయణ తెలిపాారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షకు 248 మంది అభ్యర్థులకుగాను 231 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 17 మంది గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారన్నారు. అనంతరం కళాశాల వ్యవస్థాపకులు చొప్పా గంగిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ చొప్పా ఎల్లారెడ్డి, ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ చొప్పా అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ఉన్న వసతులను పరిగణలోనికి తీసుకొని తమ కళాశాలను పరీక్షా కేంద్రంగా ఎన్నుకున్నందుకు తమకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించి విజయవంతం చేసిన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ ఎం.మారుతీ ప్రసాద్‌, అడిషనల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ టి.ఎన్‌ రంగనాథ్‌లను వారు అభినందించారు.1024 మంది విద్యార్థులు హాజరుప్రజాశక్తి-మదనపల్లి అంగళ్ళు సమీపంలోని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళా శాలలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నమూనా పాలిసెట్‌ను కళాశాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు 1024 మంది విద్యార్థులు పాల్గొని నమూనా పరీక్షను రాసినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.యువరాజ్‌ తెలిపారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌్‌ ద్వారా నిర్వహించినట్లు, విద్యార్థులు కంప్యూటర్‌ ద్వారా పరీక్షను రాసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కళాశాలలో అడ్మిషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా పాలిసెట్‌ను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షపై అవగాహన కొరకు కళాశాలలో ఈ పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. ఆదివారం అనగా ఏప్రిల్‌ 28వ తేదీన కూడా ఈ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా కళాశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని, ఆసక్తి గల విద్యార్థులు నేరుగా కలశాలకు రావచ్చని పేర్కొన్నారు. 3 గంటల సేపు ఈ పరీక్ష ఉంటుందని, విద్యార్థులకు అనుభవం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లన్నారు. ఈ సదవకాశంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

➡️