ప్రశాంతంగా యుపిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్ష

Jun 16,2024 23:54 #Upsc prelimanary exam
Upsc prelimanary exam

 ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ : విశాఖపట్నం జిల్లా కేంద్రంగా ఆదివారం నిర్వహించిన యుపిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో పరీక్ష జరగ్గా సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పర్యవేక్షించారు. కృష్ణా కాలేజీ, ఎంవిపి.కాలనీలోని గాయిత్రీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలను మల్లికార్జు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. మొత్తం 9,735 మంది దరఖాస్తు చేసుకోగా 4,677 మంది హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి, లైజన్‌ అధికారులు, ఇతర అధికారులు పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

➡️