టిడిపి నాయకుల ప్రచారం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : టిడిపి యర్రగొండపాలెం నియోజక అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు విజయాన్ని కాంక్షిసూ స్థానిక ఇందిరా నగర్‌లో టిడిపి సీనియర్‌ నేత డాక్టర్‌ మన్నె రవీంద్రతో కలిసి ఎరిక్షన్‌బాబు కుమారుడు గూడూరి అజిత్‌, కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు టిడిపి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌, బాబు ష్యూరిటి, భవిష్యత్‌ గ్యారెంటి, మహాశక్తి పథకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భాస్కర్‌, కిశోర్‌, రమణమ్మ, ఒంగోలు ఆదిరెడ్డి, గోళ్ల సుబ్బారావు, సీతా రామయ్య, ఆకాష్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, వేగినాటి శ్రీనివాస్‌, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️