పిడుగురాళ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరుపున ప్రచారంప్ర

Apr 15,2024 23:32

జాశక్తి-పిడుగురాళ్ల : ఇండియా బ్లాక్‌ తరుపున తరుపున గురజాల అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తియ్యగుర యలమందరెడ్డిని గెలిపించా లని కోరుతూ సోమవారం పిడుగురాళ్ల పట్టణంలో కాంగ్రెస్‌, సిపిఎం శ్రేణులు ప్రచారం చేపట్టాయి. సీతారాంపురం తండా, ప్రజాశక్తినగర్‌, అంబేద్కర్‌ కాలనీ, ఎమ్మార్వో ఆఫీస్‌ ఏరియా, చించాల డొంక తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలిచ్చి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్‌ జొన్నలగడ్డ యోహన్‌, సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీనివాస రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వస్తే రైతు రుణమాఫీని రూ.2 లక్షలు అమలు చేస్తామని, ప్రతి మహిళకు రూ.లక్ష ఆదాయం వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ కూలిని పెంచుతా మన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల కేటాయిస్తామని, వృద్ధులు, వితంతు వులకు పింఛన్లు రూ.4 వేలు చేస్తామని, వికలాంగుల రూ.6 వేలు ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో డి.వెంకటే శ్వర్లు, షేక్‌ బాబు, రామకృష్ణ, హుస్సేన్‌, జె.రమణ, ఎస్‌.లక్ష్మీ, మరియబాబు, యో హాను, వేణు, ఎం.సామ్రాట్‌ పాల్గొన్నారు.

➡️