ఆకవీడులో కార్డెన్‌ సెర్చ్‌

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో శుక్రవారం గిద్దలూరు రూరల్‌ సీఐ దాసరి ప్రసాద్‌, రాచర్ల ఎస్‌ఐ హరిబాబు ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ దాసరి ప్రసాద్‌ తెలిపారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్డెన్‌ సెర్చ్‌లో కొమరోలు ఎస్‌ఐ మధుసూదన్‌రావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️