వైద్యసేవలపై కేంద్ర బృందం ఆరా

Jun 12,2024 21:38

 ప్రజాశక్తి-పాచిపెంట : పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రబృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి బృందం సభ్యులు ఆరా తీశారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా? లేదా? అని వైద్యాధికారి జి.వెంకట రమణను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన మందులు పంపిణీ, దస్త్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, పిహెచ్‌సితోపాటు సబ్‌ సెంటర్లో అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు గుర్తించేందుకు పి.కోనవలస సబ్‌ సెంటర్‌ను పరిశీలించారు. బృందంలో డాక్టర్‌ బాలు మోటో. డాక్టర్‌ హిమక్కౌర్‌ డాల్‌తోపాటు రాష్ట్ర అధికారులు. డాక్టర్‌ శాంతి సౌందర్య, డాక్టర్‌ పిఎల్‌ రఘుకుమార్‌ తదితరులు ఉన్నారు.

➡️