‘అన్నమాచార్య’లో సిజిఆర్‌ టాలెంట్‌ మీట్‌ ప్రారంభం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం సిజిఆర్‌ (చైతన్య జ్ఞాన రత్న) టాలెంట్‌ మీట్‌-2024 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, యోగివేమన యూనివర్సిటీ డాక్టర్‌ బి.జయరామిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కాలాన్ని వథా చేయకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను అభ్యసిస్తూ ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు. 90 శాతం మంది విద్యార్థులు కాలాన్ని వథా చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రతి విద్యార్థి ఆధునిక సాంకేతికతో ఆవిష్కరణలు చేస్తూ నవశకానికి నాంది పలకవచ్చన్నారు. అనంతరం కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్‌ చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రెండు లక్షలకుపైగా పుస్తకాలు ఉన్నాయని, ఆఫ్‌లైన్‌లో యాభై వేలు పుస్తకాలు దొరుకుతున్నాయని, వీటిని సమగ్రంగా వినియోగించుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు కొత్తకొత్త ఆలోచనలతో విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రతి ఏడాది టాలింట్‌ మీట్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఇలాంటి టాలెంట్‌ మీట్‌లను సక్రమంగా సద్వినియోగిం చేసుకొని వారి ప్రతిభను గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ఎంవి నారాయణ మాట్లాడుతూ బుధవారం, గురువారం సిజిఆర్‌ టాలెంట్‌ మీట్‌ను అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా బుధవారం సివిల్‌, మెకానికల్‌, ఇసిఇ, ఇఇఇ విభాగాలనందు పేపర్‌ ప్రజెంటేషన్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌ ఉంటాయని, గురువారం సిఎస్‌ఇ, ఎఐడిఎస్‌, ఎఐఎంఎల్‌, ఎంసిఎ, ఎంబిఎ విభాగాలకు చెందిన ప్రజెంటేషన్స్‌ గురువారం ఉంటుందని తెలిపారు. డీన్‌ డాక్టర్‌ ఎం.సుబ్బారావు మాట్లాడుతూ అనితర మేధో సంపత్తికి అద్వితీయ సజన తోడైతే కళ్ళ ముందు అద్భుతాలు విస్కతమవుతాయన్నారు. సష్టికి ప్రతి సష్టి లాంటి ఆవిష్కరణలతో ఇంకో నవశకాన్ని నిర్మించే అపర విశ్వకర్మలు సివిల్‌ ఇంజినీర్లని చెప్పుకొచ్చారు. మంత్రాలు, తంత్రాలు ఉన్న రోజుల్లోనే యంత్రాలను కనిపెట్టి మానవ మనుగడకు పునాది అయ్యి బ్రతుకు బండిని ముందుకు నడిపిస్తున్నది మెకానికల్‌ ఇంజినీర్లని తెలిపారు. చిమ్మ చీకట్లో, కిరోసిన్‌ బుడ్డి వెలుతురులో దయనీయంగా ఉన్న మానవ జీవన విధానానికి రాత్రివేళ మరో సర్క్యూట్‌ సష్టించి, భగభగ మండే ఎండలో సైతం చల్లని ఏసీ చలితో చరించేలా చేసిన ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు ఉన్నారని తెలిపారు. తరతరాల అంతరాలను తరంగాల ద్వారా ఛేదించి అంతర్జాలంలో మాయాజాలాన్ని సష్టిస్తున్న ఆధునిక బ్రహ్మలైన ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్లకు స్వాగతం సుస్వాగతం అంటూ తనదైన శైలిలో ప్రసంగించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు హెచ్‌ఒడిలు ప్రసంగించారు. చివరగా ముఖ్య అతిథి అయినటువంటి ప్రొఫెసర్‌ జయరాంరెడ్డిని కళాశాల వైస్‌ చైర్మన్‌ చొప్పా ఎల్లారెడ్డి ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఒడిలు డాక్టర్‌ టి.నరేష్‌ కుమార్‌, సివిల్‌ డిపార్టుమెంట్‌, డాక్టర్‌ సి.హెచ్‌ నాగరాజు, ఇసిఇ, డాక్టర్‌ ఎ.హేమంత్‌ కుమార్‌, ఇఇఇ డిపార్టుమెంట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఒ.హేమకేశవులతోపాటు మెకానికల్‌, సివిల్‌, ఇసిఇ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

➡️