ఆచంటలో చలివేంద్రం ప్రారంభం..

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట కచేరి సెంటర్లో మహాశివరాత్రి సందర్భంగా వచ్చే యాత్రికుల కోసం గురువారం నెక్కంటి రామదాసు అన్నపూర్ణ స్మారకార్థం సిఐటియు, యుటిఎఫ్‌, డివైఎఫ్‌ఐ, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలం మాట్లాడుతూ.. దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదాచారుల దాహుర్తిని తీర్చడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సిర్రా నరసింహమూర్తి, పరువు మోహన్‌ రావు, వద్దిపర్తి అంజిబాబు, కుసుమే జయరాజు, రైతు సంఘం నాయకులు కొండేటి సత్యనారాయణ, సరిళ్ల రాధాకృష్ణ, రాంబాబు, కే రాజు, బెనర్జీ, వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.

➡️