రాష్ట్రాభివృద్ధికి చంద్రన్న రావాలి: వర్మ

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: పిట్టలవానిపాలెం మండలంలో కోడూరు, సంగుపాలెం, కోమలి, భవనంవారిపాలెంలో కూటమి అభ్యర్థి నరేంద్రవర్మ, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామాల్లో స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వేగేశన నరేంద్రవర్మ ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాలతో కూడిన నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ప్రజాపాలన సాధ్యమవుతుందన్నారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా వేగేశన నరేంద్ర వర్మని గెలిపించాలని కృష్ణ ప్రసాద్‌ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త శ్రీమన్నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️