భద్రతా ఏర్పాట్లు తనిఖీ

May 15,2024 21:42

ప్రజాశక్తి-గరుగుబిల్లి :మండలంలోని ఉల్లిభద్రలో ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూముల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ బుధవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌రూములకు కల్పించిన మూడంచెల భద్రత, బందోబస్తు పరిశీలించారు. మొదటి స్థాయిలో స్థానిక పోలీసులు, రెండో స్థాయిలో రాష్ట్ర సాయుధ బలగాలు, మూడో స్థాయిలో కేంద్ర సాయుధ బలగాల పహారా ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పహారాతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులకు వారు సూచించారు. కార్యక్రమంలో జెసి ఎస్‌.శోబిక, ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ, ఎఎస్‌పి ఒ.దిలీప్‌ కిరణ్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️