అంగన్వాడీలది చారిత్రాత్మక విజయం

Jan 27,2024 00:07
అంగన్వాడీలది చారిత్రాత్మక విజయం

శ్రీ విజయోత్సవ సభలో యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజుప్రజాశక్తి-కార్వేటినగరం: 42 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విరోచితమైన సమ్మె చేసి అనేక విజయాలు సాధించిన సందర్భంగా శుక్రవారం కార్వేటినగరం ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో విజయోస్తవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ 42 రోజులు కాలంలో ప్రభుత్వం, అధికారులు అనేక రకాల అవరోధాలు సష్టించినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా పోరాటం చేసిన అంగన్వాడీల అందరినీ ఆయన అభినందించారు. మరోసారి అంగన్వాడీల ఐక్యత చాటి చేప్పారన్నారు. తాళాలు పగలగొట్టి, నోటీసులు ఇచ్చినా, టెర్మినేషన్‌ చేసినా ఏమాత్రం లెక్క చేయకుండా కలెక్టరేట్‌ ముట్టడి, చలో విజయవాడ లాంటి విరోచితమైన పోరాటాలు చేయడంతో పోరాటం సఫలీకృతమైందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మ అధ్యక్షత వహించగా కార్యదర్శి మమత మాట్లాడుతూ ఇదే పద్ధతిలో ప్రాజెక్టులో భవిష్యత్తులో కూడా ఐక్యతగా ఉండాలని ఇలాంటి సమస్యలు వచ్చినా కమిటీ హామీ ఇచ్చారు. నాయకులు రాణి, భాను తదితరులు పాల్గొన్నారు.

➡️