అధికారిక శిలాఫలకాలపై టిడిపి నాయకుల ఫొటోలుఆ నాయకుల పయనం ఎటో?

అధికారిక శిలాఫలకాలపై టిడిపి నాయకుల ఫొటోలుఆ నాయకుల పయనం ఎటో?

అధికారిక శిలాఫలకాలపై టిడిపి నాయకుల ఫొటోలుఆ నాయకుల పయనం ఎటో?ప్రజాశక్తి -వెదురుకుప్పం : వెదురు కుప్పం గ్రామంలో టిడిపి నాయకుల ఫొటోలు అనూ హ్యంగా అధికారిక ప్రభుత్వ శిలాఫలకంపై దర్శనమిచ్చాయి. ఈ పరిణామం పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలంలో ఆదివారం జరిగే ప్రభుత్వ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంపై టిడిపికి చెందిన నాయకుల ఫొటోలను ముద్రించారు. వెదురుకుప్పం ఎంపిటిసి రాధిక భర్త పురందర రెడ్డి బంధువు అయిన భాస్కర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ చిరంజీవి రెడ్డిల ఫొటోలను శిలా ఫలకంపై ముద్రించడంతో టిడిపిని వదిలి వైసిపికి వచ్చినట్లు అధికార పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరూ టిడిపిలో ఉంటే వాళ్లకు వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేస్తానని టిడిపి సీనియర్‌ నాయకుడు అల్టిమేటం జారీ చేయడంతో ఈ విషయం వైరల్‌ అవుతోంది. మొత్తానికి ఆ ఇద్దరు నాయకుల పయనం ఎటో తేలాల్సి ఉంది.

➡️