కుప్పం నుంచే శ్రీకారంఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తెస్తా మిల్క్‌, సిల్క్‌, హనీ ఉత్పత్తులకు ప్రాధాన్యతరెండో రోజు అధికారులతో చంద్రబాబు సమీక్

Jun 26,2024 22:39
కుప్పం నుంచే శ్రీకారంఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తెస్తా మిల్క్‌, సిల్క్‌, హనీ ఉత్పత్తులకు ప్రాధాన్యతరెండో రోజు అధికారులతో చంద్రబాబు సమీక్

కుప్పం నుంచే శ్రీకారంఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తెస్తా మిల్క్‌, సిల్క్‌, హనీ ఉత్పత్తులకు ప్రాధాన్యతరెండో రోజు అధికారులతో చంద్రబాబు సమీక్షప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, శాంతిపురం పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తానని, గత పాలనకు, ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అధికారులు ఫిజికల్‌గానూ, వర్చువల్‌గానూ పని విధానాలకు సిద్ధపడాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం కుప్పం అతిథిగృహంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కనిపించకూడదన్నారు. రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గత ఐదేళ్లు అధికారులు మనస్సు చంపుకుని పనిచేశారని, వైసిపి నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారన్నారు. తన సొంత నియోజకవర్గానికి తాను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారన్నారు. తనపై హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. 2019 వరకూ తనపై ఒక్క కేసు లేదని, గత ఐదేళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తానన్నారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించి తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, హంద్రీనీవా కాల్వ పనులు పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలని, డెయిరీ, మిల్క్‌, సిల్క్‌, హనీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కుప్పానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తెస్తామన్నారు. కుప్పాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌ చేస్తానన్నారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తానన్నారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి డిపార్టుమెంట్‌ నుంచి పక్కా ప్రణాళికతో రావాలని, నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని అధికారులను ఆదేశించారు. ‘చరణి’గా చిన్నారికి నామకరణం శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్‌, ప్రియ దంపతుల రెండో కుమార్తె చిన్నారికి ‘చరణి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా నామకరణం చేశారు. బుధవారం ఆర్‌ అండ్‌ బి అతిథిగృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజలు ముఖ్యమంత్రిని కలిసారు. ఈ సందర్భంగా ఈ దంపతులు తన కుమార్తె చిన్నారికి నామకరణం చేయాలని కొరగా, ముద్దులొలికే పాపకు చరణి అని పేరు పెట్టారు. దీంతో దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. 846 సమస్యల అర్జీలు ఆర్‌ అండ్‌ బి అతిథిగృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా 846 సమస్యలపై అర్జీలు అందాయి. ఉదయాన్నే అర్జీదారులు ఇబ్బంది పడకుండా జిల్లా యంత్రాంగం టిఫిన్‌, తాగునీరు, మజ్జిగ అందించింది. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున అర్జీదారులు చంద్రబాబును కలిసేందుకు విచ్చేశారు. చంద్రబాబు స్వయంగా అర్జీలు స్వీకరిస్తూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు సూచించారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లి పోరాట కమిటీ నాయకులు చంద్రబాబును కలిసి శెట్టిపల్లి సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.నాయకులు రాధాక్రిష్ణ, క్రిష్ణ, ఎన్‌డి శ్రీను చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. – గుడిపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీ పెద్దగొల్లపల్లి గ్రామానికి చెందిన విజయరాజు మూగ చెవిటి (22) గత ఏడాది కొబ్బరిచెట్టు ఎక్కి కిందపడి వెన్నుమొక విరిగింది. ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిపారు. పింఛన్‌, మూడు చక్రాల మోటార్‌ సైకిల్‌ మంజూరు చేయాలని సిఎంను కోరారు. – వి.కోటకు చెందిన కల్యాణ్‌ (21) గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం అయ్యాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేయాలని అర్జీని, మెడికల్‌ బిల్లులను అందజేశారు. అత్యున్నత ప్రమాణాలతో కుప్పం బస్టాండ్‌ సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన బస్టాండ్‌గా నిర్మిస్తామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు జి.రవివర్మ, చంద్రశేఖర్‌, జి.వెంకటేశ్వరరావు, చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్‌ యు.శ్రీనివాస్‌, రీజినల్‌ మేనేజర్‌ జితేంద్రనాథ్‌రెడ్డిలతో కలిసి ఐదు కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ను, డిపోను, గ్యారేజిని పరిశీలించారు. గతంలో రద్దుచేసిన 30 సర్వీసులను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో కుప్పం నుంచి తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలకు సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కమిటీని వేసి కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ అమలు తీరు పరిశీలించి అమలు చేస్తామన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి కుప్పం నుంచి హైదరాబాద్‌కు, గురువారం ఉదయం 5 గంటలకు కుప్పం నుంచి నెల్లూరుకు వెళ్లే బస్సులను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి వై సి యం ఈ. నాగేశ్వరరావు, డిపో మేనేజర్‌ పెంచాలయ్య పాల్గొన్నారు.సాదర వీడ్కోలు రెండు రోజుల పర్యటన కుప్పం నియోజకవర్గంలో ముగించుకున్న సిఎం చంద్రబాబునాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ, తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు పిఇఎస్‌ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, అనంపురం రేంజి డిఐజి పిమోషి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్‌పి మణికంఠ చందోలు, ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్‌, ఎంఎల్‌ఎలు, ఆర్‌డిఒ శ్రీనివాసులు వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.

➡️