అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి ప్రజాశక్తి -వి కోట : మండల పరిధిలోని గోనుమాకుల పల్లి పంచాయతీ నాగిరెడ్డిపల్లికి చెందిన మురళి కుమారుడు నవదీప్‌ (11) అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందా డు. స్థానికుల కథనం మేరకు.. గ్యారంపల్లి గురుకుల పాఠశాలలో ఉంటూ 6వ తరగతి చదువుతున్న విద్యార్థి నవదీప్‌ సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ కావాలనడంతో వికోట నుంచి తండ్రి తీసుకు వచ్చి విద్యార్థికి ఇచ్చాడు. తింటుండ గా గుక్క పట్టేయడంతో ఊపిరి ఆడలేదని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటా హుటినా బాలున్ని కారులో వికోటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో వాంతులు చేసుకున్నాడు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి అప్పటికే మతి చెందినట్లు ధృవీకరించారు. అల్లారు ముద్దుగా ఆటలాడుతున్న విద్యార్థి భోజనం తింటూ కుప్పకూలి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. బాలుని తండ్రి మురళి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులుకు అత్యంత సన్నిహితుడు కావడంతో నాగిరెడ్డిపల్లికి చేరుకున్న జడ్పీ ఛైర్మన్‌ బాలునికి నివాళులర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️