ప్రభుత్వ సాయం అందిస్తాం..ఏనుగు దాడి మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తహశీల్దారు

ప్రభుత్వ సాయం అందిస్తాం..ఏనుగు దాడి మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తహశీల్దారు

ప్రభుత్వ సాయం అందిస్తాం..ఏనుగు దాడి మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తహశీల్దారుప్రజాశక్తి – రామకుప్పం: ఏనుగు దాడిలో మతి చెందిన పీఎం తండాకు చెందిన కన్నా నాయక్‌ కుటుంబానికి ప్రభుతవ సాయం అందించి ఆదుకుంటామని తహశీల్దారు శ్రీధర్‌ హామీ ఇచ్చారు. మండల పరిధిలోని పీఎం తండాకి చెందిన కన్నా నాయక్‌ ఇటీవల ఏనుగు దాడిలో మతి చెందాడు. తహశీల్దార్‌ శ్రీధర్‌ బుధవారం తమ సిబ్బందితో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు పంటల పైకి గ్రామాల్లోకి చొరబడకుండా ప్రభుత్వం కందకాలు, సోలార్‌ కంచె ఏర్పాటుకు చర్యలు చేపడుతుందన్నారు. అటవీ గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️