ఎన్‌సిసి విద్యార్థుల సేవలు అభినందనీయం అంకితభావం దేశానికి గొప్ప మద్దతు ఎస్‌పి మణికంఠ చందోలు

ఎన్‌సిసి విద్యార్థుల సేవలు అభినందనీయం అంకితభావం దేశానికి గొప్ప మద్దతు ఎస్‌పి మణికంఠ చందోలు

ఎన్‌సిసి విద్యార్థుల సేవలు అభినందనీయం అంకితభావం దేశానికి గొప్ప మద్దతు ఎస్‌పి మణికంఠ చందోలు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: ఎన్‌సిసి విద్యార్థుల సేవలు అభినందనీయమని వారి అంకిత భావం దేశానికి గొప్ప మద్దతు అని ఎస్‌పి మణికంఠ చందోలు ప్రశంసించారు. ఎన్‌సిసి 35వ బెటాలియన్‌ పది రోజుల ట్రైనింగ్‌ క్యాంప్‌ బుధవారం ముగిసింది. ట్రైనింగ్‌ క్యాంప్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌పీకి ఎన్‌సిసి 35 ఆంధ్రా బెటాలియన్‌ కర్నూల్‌ వివేక్‌ మోనిస్‌ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఎన్నో సందర్భాల్లో నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌( ఎన్‌సిసి) విద్యార్థులు అందిస్తున్న సేవలు నిజంగా అభినంద నీయమ న్నారు. ఈ యువ జవాన్లు దేశభక్తితో, సమర్పణతో తమ బాధ్యతలను నిర్వర్తిస్తారని, ఎన్నికల సమయంలో వివిధ విధుల్లో పాల్గొనడం, శాంతి భద్రతను పరిరక్షించడం, ఓటర్లకు సహాయపడడం వంటి సేవలలో ఎన్‌సిసి విద్యార్థులు ముందుంటారని నిరూపించారు. వారి ఆత్మీయత, నిస్వార్థ సేవ మనందరికీ ఆదర్శం అని ఎస్‌పీ పేర్కొన్నారు. 2024 ఎన్నికల సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్‌సిసి విద్యార్థులకు ఎస్‌పీ సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రశంసించారు. ఎన్నికల సమయంలో, ట్రైనింగ్‌ సమయంలో తమకు ఎంతగానో సహాయపడి కషి చేసిన ఎస్‌పీని ఎన్‌సిసి అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి కల్ననల్‌ వివేక్‌ మోనిస్‌, మేజర్‌ లోకనాథన్‌, సబ్‌ మేజర్‌ చెత్రి, చిత్తూరు జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ డిఎస్పీ శ్రావణ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️