అభివృద్ధి పనులు వేగవంతం చేయండిజెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

అభివృద్ధి పనులు వేగవంతం చేయండిజెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

అభివృద్ధి పనులు వేగవంతం చేయండిజెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుప్రజాశక్తి- వి కోట : మండల పరిధిలోని అన్ని సచివాలయాల్లో ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. వి కోట గ్రామ పంచాయతీ లోని అంబేద్కర్‌ నగర్‌ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో ఆన్లైన్‌ , ఆఫ్‌ లైన్‌ అటెండన్స్‌ రిజిస్టర్‌ ను పరిశీలించారు. అటెండన్స్‌ రిజిస్టరులో సిఎల్‌ లను వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. మూవ్‌ మెంట్‌ రిజిస్టర్‌లో క్యాంపు వివరాలు వెంటనే నమోదు చేయాలని సచివాలయ సిబ్బందికి తెలిపారు. రాబోయే వేసవిలో పజలకు తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా తగుచర్యలు తీసుకోవాలన్నారు. వైస్సార్‌ గహ నిర్మాణ పథకం కింద నిర్మితమవుతున్న గహాల నిర్మాణాలను వేగవంతం చేసి , త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అన్ని పనులను వాలంటీర్లను సమన్వయ పరుచుకుని వారికి సత్వరం అందించాలని ఆదేశించారు. వీరితోపాటు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️