అమ్మా.. ఇక రావా..!

Dec 28,2023 22:21
అమ్మా.. ఇక రావా..!

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం: అనుమానాస్పదంగా వివాహిత మృతి చెందిన సంఘటన గురువారం ఎస్‌ఆర్‌ పురం మండలం చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిలోని ఓ ఇటుకల బట్టీ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని వెంకటాపురం దళితవాడకు చెందిన ధన్య(28), కర్నాటక రాష్ట్రం బెంగళూరు, ఇందిరానగర్‌కు చెందిన గౌతమ్‌(32)కి ఐదేళ్ల కిందట వివాహం అయింది. వీరికి దానివేల్‌(3), యప్సిక(9నెలల) పిల్లలు ఉన్నారు. ధన్య తల్లిదండ్రులు శాంతి, పొన్నా విజరుకుమార్‌లు చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి పక్కన సిమెంట్‌ బట్టీల్లో కార్మికులుగా పనిచేస్నున్నారు. మృతురాలు ధన్య రెండో కాన్పుకని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నెల 24వ తేదీ గౌతమ్‌ ధన్య వద్దకు వచ్చారు. రెండు రోజులుగా ధన్య, గౌతమ్‌లు మద్య గొడవలు జరిగాయి. గురువారం ఉదయం ఇరువురు గొడవపడ్డారు. మధ్యాహ్నం ధన్య మృతి చెందగా అనుమానం రాకుండా అనారోగ్యమంటూ గౌతం భార్యను అసుపత్రికి తీసుకెళ్లాడని, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించడంతో చేసేది లేక తీసుకొచ్చాడని స్థానికులు, కుటుంబీకులు చెబుతున్నారు. దీంతో భర్త గౌతమ్‌ని గ్రామస్తులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. అతని విచారించాలని పోలీసులను కోరారు. పాలసముద్రం ఎస్‌ఐ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అమ్మ చుట్టూ చిన్నారుల రోదన తల్లి మృతదేహం చుట్టూ చిన్నారులు రోదిస్తూ తిరిగారు. అమ్మ ఇక లేదని తెలియక అమ్మ.. లే అమ్మా అంటూ చుట్టూర తిరిగారు. తన తల్లి పక్కన కూర్చొని తల్లిని పలకరించే ప్రయత్నం చేస్తుంటే అది చూసిన స్థానికులు దు:ఖం ఆపుకోలేక అమ్మలేదని చిన్నారులకు అర్థమైయ్యేటు చెప్పలేక గుండెలవిసేలా రోదించారు. వారి దు:ఖాన్ని చూసిన చిన్నారులకు అర్థంకాక ఎక్కిఎక్కి ఏడ్చారు. సంఘట స్థానకులతో పాటు పోలీసులను కలచివేసింది.

➡️