అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ ఇంటి పట్టాలు- దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి అర్హులను గుర్తించండి- రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ ఇంటి పట్టాలు- దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి అర్హులను గుర్తించండి- రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ ఇంటి పట్టాలు- దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి అర్హులను గుర్తించండి- రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ ఆదేశంప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో అర్హత గల ప్రతి జర్నలిస్ట్‌ కు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు 3 సెంట్‌ ల ఇంటి పట్టాలను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరం లో జర్నలిస్ట్‌ లకు ఇంటి పట్టాల మంజూరు పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎస్‌. షన్మోహన్‌ మాట్లాడుతూ జర్నలిస్ట్‌ ల ఇంటి పట్టాలకు సంబంధించి కమిషనర్‌, సమాచార శాఖ కార్యాలయం నుండి ప్రాథమిక వెరిఫికేషన్‌ అనంతరం 301 దరఖాస్తులు ఆన్‌ లైన్‌ లో అందాయని తెలిపారు. ఆన్‌ లైన్‌ లో అందిన దరఖాస్తులలో అర్హులను గుర్తించే ప్రక్రియను రెవెన్యూ శాఖ వేగవంతం చేయాలని ఆదేశించారు. జర్నలిస్ట్‌ ల ఇంటి పట్టా మంజూరులో దరఖాస్తుదారునికి గల సమస్యను కమిటీ దష్టికి తీసుకు వస్తే సమాచార శాఖ కమిషనర్‌ కు పంపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, చిత్తూరు ఆర్డిఓ చిన్నయ్య, కమిటీ సభ్యులు సహదేవ, సయ్యద్‌ అక్రం, కన్వీనర్‌, డిఐపిఆర్‌ఓ బి. పద్మజ, చిత్తూరు, గుడిపాల తహశీల్దార్లు మురళిమోహన్‌, బాబు రాజేంద్ర ప్రసాద్‌, చిత్తూరు ప్రెస్‌ క్లబ్‌ సెక్రెటరీ అశోక్‌ కుమార్‌, పాత్రికేయులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

➡️