ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

Dec 26,2023 21:47

ప్రజాశక్తి- పుంగనూరు: ఏపీఎస్‌ ఆర్టీసీ పుంగనూరు డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ రాష్ట్ర కన్వీనర్‌ తులసీరామ్‌ కోరారు. పుంగనూరు డిపో మేనేజర్‌ సుధాకర్‌కు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికులకు సర్కులర్‌ ప్రకారం కాంట్రాక్టర్‌ జీతాలు చెల్లించలేదని చెప్పారు. ఈఎస్‌ఐ, పిఎఫ్‌ అమౌంటు కార్మికుల ఖాతాలో జమ అవుతున్నది లేనిది తెలియడం లేదన్నారు. ఈఎస్‌ఐలో కుటుంబసభ్యులను చేర్చకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్మికులకు సంవత్సరానికి ఒకసారి పిఎఫ్‌ , ఈఎస్‌ఐ రసీదులు ఇవ్వాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగే డిఏతో కలసి చెల్లించవలసిన జీతం సర్కులర్‌ నోటీసుబోర్డులో ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్లీపింగ్‌, క్లీనింగ్‌ వారికి మెటీరియల్‌ కాంట్రాక్టర్‌ ఇచ్చే విధంగా చూడాలన్నారు. ప్రతినెలా పదో తేదీలోపు కార్మికులకు జీతాలు చెల్లించాలని ఈ సమస్యల పరిష్కారానికి కషి చేయాలని కోరారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దుచేసి సంస్థ ద్వారానే కార్మికులకు జీతాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు బాధ్యుడు మురళి పాల్గొన్నారు.

➡️