ఆర్వో ప్లాంటు వితరణ

Dec 26,2023 21:46

ప్రజాశక్తి- నగరి: స్థానిక జ్యూడిషల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మణివాసగం ఆర్వో ప్లాంటును వితరణగా అందించారు. మంగళవారం ప్లాంటును కోర్టు ఆవరణలో ఏర్పాటు చేయగా జడ్జి విష్ణువర్మ ప్లాంటును ప్రారంభించారు. ఈకార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు వేలాయుధం, కార్యదర్శి జాన్‌ జోష్‌, సహకార్యదర్శి కె.రాము, కోశాధికారి నాగరాజన్‌, సీనియర్‌ న్యాయవాదులు సుబ్రమణిరెడ్డి, ఏజీపి మురళి. ఉదయభాను, మురళీధర్‌, బాబు, ఇజి బాబు, ధరణి, అనిఫా. త్యాగరాజన్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

➡️