ఇరు గ్రూపుల ఘర్షణ గంగమ్మ గుడిలోకి పాదరక్షలు విసిరిన వైనం ఆగ్రహించిన దళిత వర్గాలు పోలీసు స్టేషన్‌, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్

ఇరు గ్రూపుల ఘర్షణ గంగమ్మ గుడిలోకి పాదరక్షలు విసిరిన వైనం ఆగ్రహించిన దళిత వర్గాలు పోలీసు స్టేషన్‌, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్

ఇరు గ్రూపుల ఘర్షణ గంగమ్మ గుడిలోకి పాదరక్షలు విసిరిన వైనం ఆగ్రహించిన దళిత వర్గాలు పోలీసు స్టేషన్‌, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నాప్రజాశక్తి -పుంగనూరు ఇరు గ్రూపుల ఘర్షణ తో గంగమ్మ గర్భగుడిలోకి పాదరక్షలు విసరడంతో ముస్లిం యువత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్‌, ఏటిగడ్డ పాలెం పక్కపక్కనే ఉన్నాయి. ఉబేదుల్లా కాంపౌండ్‌ లో ముస్లింలు ఏటిగడ్డ పాలెం లో దళితులు నివాసం ఉంటున్నారు. దళితులు ఏటిగడ్డపాళ్యంలో విరాళాలతో నిధులను సేకరించి గంగమ్మ గుడిని నిర్మించుకొని నిత్యం పూజలు చేసుకుంటున్నారు. ఇటీవల టిప్పు సుల్తాన్‌ జెండాను గుడి వద్ద తమకు తెలియకుండానే కట్టారని వాటిని తొలగించారు. ‘మేము కట్టిన జెండాను ఎందుకు తొలగిస్తారు?’ అంటూ శనివారం రాత్రి ఓ గ్రూపునకు చెందిన యువత కట్టెలు, కర్రలతో దళిత వర్గాల పై దాడి చేసి గంగమ్మ గుడిలోకి పాదరక్షలు, కర్రలు విసిరారు. దీంతో సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై పట్టణంలో ఆగ్రహించిన కొన్ని సంఘాలు దళిత వర్గాలకు మద్దతు తెలుపుతూ పోలీస్‌ స్టేషన్‌ , అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ధర్నా సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత మహిళలు మాట్లాడుతూ రాత్రి మా ప్రాంతంలో భయానక వాతావరణం సష్టించిన ముస్లిం యువత ఆగడాలు చూసి భయభ్రాంతులకు గురయ్యామని ఏమి జరుగుతుందోనని తెలుసుకునే లోపే తమ పిల్లల పై దాడులు చేసి గాయాలు చేశారని, గంగమ్మ ఆలయంలోకి పాదరక్షలు, కర్రలు విసిరారని ఆరోపించారు. ఈ సంఘటనను చూస్తే యువత బరితెగించడం తీవ్రంగా ఖండిస్తున్నామని వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే తాము కూడా వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులు ఈ కేసులను రాజీపరిచేందుకు ప్రయత్నిస్తుండగా మరో గ్రూపు వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై తీవ్రంగా ప్రతి స్పందించకుంటే పరిస్థితులు ఉద్రిక్తతతకు దారితీస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారా? అని తెలుసుకునేందుకు ప్రయత్నించగా వారి సమాధానం దాటవేయడం, ఫోన్లు తీయడంలేదు. సంఘటనను సున్నితంగా పరిష్కరించుకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం వుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిపై స్టేషన్‌, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వ హించారు.

➡️