ఉద్యోగ భద్రత కల్పించాలి12వ రోజుకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల దీక్షలు

ఉద్యోగ భద్రత కల్పించాలి12వ రోజుకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల దీక్షలు

ఉద్యోగ భద్రత కల్పించాలి12వ రోజుకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల దీక్షలు ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌, బంగారుపాళ్యం: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమ్మె చేపట్టిన సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమ్మె ఆదివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు కొన సాగిం చారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల పోరా టానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య మద్దతు ప్రకటించారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగు ల న్యాయమైన సమస్యలను ప్రభు త్వం పరిష్కరించాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జేఏసి నాయకులు శ్రీనివాస యాదవ్‌, లోకనాధం మాట్లాడుతూ 12 రోజులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తు న్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరులో మార్పు రాకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల పోరాటానికి ఏపిటిఎఫ్‌ నేతలు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యో గుల సమస్యలను పరిష్కరించా లన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సమగ్రశిక్షా అభియాన్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ‘సమగ్ర శిక్ష’ సిబ్బంది సమ్మెకు ఆర్థిక సాయంసమగ్ర శిక్షా అభియాన్‌ సిబ్బంది సమ్మెకు ఆర్థిక సహాయం అందించామని ఉపాధ్యాయ సంఘా లు తెలిపాయి. ఆదివారం చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద సమగ్ర శిక్షా సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరవ ధిక సమ్మెకు మద్దతుగా మండల విద్యాశాఖ తరఫున ఆర్థిక సాయం అందించారు. బంగారు పాళెం మండల ఉపాధ్యాయుల ద్వారా విరాళాల రూపంలో వచ్చిన 18వేలా2 రూపాయల నగదును బంగారు పాళెం మండల విద్యా శాఖాధి కారులు నాగేశ్వర రావ,ు రమేష్‌బాబు, ఉపాధ్యాయులు లక్ష్మీపతి, ధనంజయ రాజు, తదితరులు అందించారు.ఏపిటిఎఫ్‌ మద్దతుసమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల దీక్ష కు ఎపిటిఎఫ్‌ జిల్లా శాఖ ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు గోపీనాథ్‌ మాట్లాడుతూ వారి న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సమాన పనికి సమాన వేతనం, పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీ లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు నవీన్‌ కుమార్‌, ప్రభాకర్‌ , నాయకులు, వాసుదేవయ్య , మురళీకష్ణ , శంకరయ్య, అఫ్జల్‌ బాష, వేణు ,లక్ష్మీపతి పాల్గొన్నారు.

➡️