ఎర్రచందనం స్వాధీనం

Dec 30,2023 22:13
ఎర్రచందనం స్వాధీనం

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుమల అటవీ ప్రాంత ంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా కు వివరాలను వెల్లడించారు. శనివారం తిరుమలలోని మావిళ్ళ మంద ప్రదేశం వద్ద రెండు వాహనాలలో ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న 9మంది స్మగ్లర్లని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారి వద్ద 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసు కున్నట్లు పేర్కొన్నారు. ఘటనలో ఇద్దరు స్మగ్లర్లు తప్పి ంచుకొని పారిపోయినట్లు తెలిపారు. స్వాధీనం చేసు కున్న 15 దుంగల బరువు 463 కేజీలుగా ఉన్నాయని, విలువ రూ.9 లక్షల ఉంటుందన్నారు. కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడులలో ఎఫ్‌ఆర్‌ఓ చెంచులక్ష్మి, ఎఫ్‌బిఓ మురళి, బేస్‌ క్యాంపు నిఘా సిబ్బంది పాల్గొన్నారు.

➡️