ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థికసాయం

Jan 1,2024 21:39
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థికసాయం

ప్రజాశక్తి- బంగారుపాల్యం: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థిక సహాయం అందించినట్టు ఉపాధ్యాయసంఘాలు తెలిపాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సమగ్రశిక్ష సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక సమ్మె మద్దతుగా మండల విద్యాశాఖ తరపున ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. బంగారుపాళ్యం మండల విద్యాశాఖ సిబ్బంది మాట్లాడుతూ సమగ్రశిక్షణలో విధులు చేపడుతున్న వారు కూడా విద్యాశాఖ కుటుంబ సభ్యులేనని, కావున ప్రభుత్వం వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. మండల ఉపాధ్యాయ బందం వారు విరాళాల రూపంలో వచ్చిన రూ.18,002ల నగదును మండల విద్యా శాఖాధికారులు నాగేశ్వర రావు, రమేష్‌ బాబు, ఉపాధ్యాయులు లక్ష్మీపతి, ధనంజయరాజు, మదన్‌ మోహన్‌, జగదీష్‌, చంద్రశేఖర్‌, భాస్కరయ్య, మోహన్‌రెడ్డి, ఉమా, నాసిర్‌ బాషాలు సమగ్ర శిక్ష జిల్లా సంఘ నాయకులైన విల్వనాదం, దేవరాజులు, ఢిల్లీ కుమార్‌, కష్ణమూర్తిలకు అందిచారు.

➡️