కుప్పంలో చంద్రబాబు హవానువైసీపీ బద్దలు కొడుతుందా..?

కుప్పంలో చంద్రబాబు హవానువైసీపీ బద్దలు కొడుతుందా..?

కుప్పంలో చంద్రబాబు హవానువైసీపీ బద్దలు కొడుతుందా..?ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : ఇక్కడ నుంచి చంద్రబాబుపై ఎవరు పోటీ చేస్తున్నారు..?, ఎవరు గెలుస్తారనే చర్చలు.. గత మూడు దశాబ్దాలుగా స్ధానికంగా కూడా జరిగేవి కావు.. దీనికి కారణం చంద్రబాబు కుప్పంలో పెంచుకున్న ఓటర్లు, నేతల నెట్‌వర్క్‌. ఏడాదికోసారి మాత్రమే నియోజకవర్గానికి వెళ్లే చంద్రబాబును మూడున్నర దశాబ్దాలుగా గెలిపిస్తున్న కుప్పం సీటు చరిత్ర ఓ సారి చూద్దాం… చిత్తూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సీట్లలో కుప్పం నియోజకవర్గం ఒకటి. గతంలో చిత్తూరు లోక్‌సభ సీటును వరుసగా టీడీపీ గెల్చుకోవడంలో కీలకమైన మెజార్టీ అందించిన నియోజకవర్గం కూడా… జనరల్‌ సీటు అయిన కుప్పంలో మొత్తం 2.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాలు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే వన్యకుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత మాల, కురవ, గాండ్ల కులస్తులు ఎక్కువగా ఉంటారు. కుప్పంలో అసెంబ్లీ ఎన్నికల చరిత్రను ఓ సారి గమనిస్తే.. ఇక్కడ టీడీపీ ఆవిర్భావానికి ముందు ఐదు ఎన్నికలు జరిగాయి. ఇందులో 1962లో కమ్యూనిస్టు పార్టీ, 1967, 1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, 1955, 1978లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచీ ఇక్కడ ఆ పార్టీదే హవా. టీడీపీ ఆవిర్భావం తర్వాత కుప్పం అసెంబ్లీ సీటుకు మొత్తం 9 ఎన్నికలు జరిగితే ఇందులో అన్నీ టీడీపీయే గెలిచింది. 1983 నుంచి 2019 వరకూ ఇక్కడ టీడీపీయే గెలుస్తూ వస్తోంది. ఇందులో రెండుసార్లు 1983, 1985లో టీడీపీ అభ్యర్ధి రంగస్వామి నాయుడు గెలిస్తే.. ఆ తర్వాత ఏడుసార్లు చంద్రబాబే గెలిచారు. చంద్రబాబును ఏడుసార్లు గెలిపించిన కుప్పంలో ఈసారి ఆ రికార్డును బ్రేక్‌ చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కుప్పంలో అభివద్ధి కార్యక్రమాలు, కేజే భరత్‌ను అభ్యర్ధిగా ప్రకటించి, గెలిస్తే మంత్రి పదవి ఇస్తామన్న హామీ, స్ధానిక ఎన్నికల్లో గెలుపు వైసీపీని ఇక్కడ ఊరిస్తున్నాయి. అయితే కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ భిన్న పరిస్ధితులు ఉన్న అసెంబ్లీ సీటులో చంద్రబాబును ఢకొీట్టి గెలవడం అంత సులువు కాదనేది ఇక్కడ వినిపిస్తున్న మాట.

➡️