చేతివృత్తులతో ఆర్థికాభివృద్ధి : సీడీపీవో

Dec 19,2023 22:33
చేతివృత్తులతో ఆర్థికాభివృద్ధి : సీడీపీవో

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: చేతివత్తులతోనే మహిళల ఆర్థికాభివద్ధి సాధ్యమవుతుందని సిడిపిఓ వినతశ్రీ అన్నారు. పాలసముద్రం మండలంకు చెందిన రూరల్‌ అక్షన్‌ ఫర్‌ సోషయల్‌ సర్వీస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆఫీసులో మహిళలకు కొబ్బరి పీచుతో దారాలు, మ్యాట్లు తయారీపై రెండవ రోజు శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు రీజనల్‌ ఆఫీసర్‌తో పాటు సిడిపిఓ సర్టిఫికెట్లులను పంపిణీ చేశారు. అనంతరం సిడిపిఓ వినతశ్రీ మాట్లాడుతూ రెడీమేడ్‌ ఫుడ్‌ లభిస్తున్నందున నేటి రోజుల్లో చిన్న పిల్లలు మొదలుకునే పెద్దల వరకు హోటల్‌, షాపుల్లో లభించే రెడీమేడ్‌ ఆహారం తీసుకుని అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. పౌష్టికాహారం లోపంతో అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల్లో సైతం బిపి, షుగర్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. రాజమండ్రి కాయర్‌ బోర్డు రీజనల్‌ ఆఫీసర్‌ ఏసుదాస్‌ మాట్లాడుతూ కేంద్రం సహకారంతో గ్రామీణ మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కాయర్‌ బోర్డు ద్వారా కొబ్బరి పీచుతో దారాలు, మ్యాట్లు తయారీపై శిక్షణను ఇస్తున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో ప్రభుత్వాల సహకారంతో చిన్న పరిశ్రమలు ఏర్పాటై మరికొందరు ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రోగ్రాం అధికారిణి నీరజ, రూరల్‌ అక్షన్‌ ఫర్‌ సోషియల్‌ సర్వీస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, వేల్కూర్‌ క్రాస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు భూపతి, అక్కనగారిపల్లె హెడ్మాస్టర్‌ గంగాధరం, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ నాగరత్నమ్మ, పలువురు మహిళలు పాల్గొన్నారు.

➡️