జాతీయస్థాయి త్రోబాల్‌ పోటీలకు ధనుష్‌

Dec 19,2023 21:37

ప్రజాశక్తి- కుప్పం: మండలంలోని టి.సదుమూరు గ్రామం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కె.ధనుష్‌ త్రోబాల్‌ పోటీల్లో జాతీయస్థాయికి ఎంపిక అయినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.పద్మనాభరాజు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నంద్యాలలో జరిగిన అండర్‌- 17, అండర్‌- 14 క్రీడాపోటీలు జరిగాయని, రాష్ట్రస్థాయి పోటీల్లో తమ పాఠశాల నుంచి మొత్తం ఆరుగురు విద్యార్థులు పాల్గొన్నారని, అందులో అండర్‌-17 పోటీలలో పదవ తరగతి చదువుతున్న ధనుష్‌ త్రోబాల్‌ క్రీడలో ఉత్తమ ప్రతిభను కనబరిచారని, అండర్‌- 14 క్రీడా పోటీలలో తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న నిత్యశ్రీ అనే విద్యార్థిని ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానాన్ని సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులతో పాటు వారికి ఉత్తమశిక్షణ అందించిన వ్యాయామ సంచాలకులు ప్రకాశన్‌లను పాఠశాల ఉపాధ్యాయ బందం అభినందించారు.

➡️