జెసిబితో దారి మూసేందుకు విపలయత్నం

Feb 8,2024 22:06
జెసిబితో దారి మూసేందుకు విపలయత్నం

కరకంబాడి లో పేదలు వేసుకున్న గుడిసెలకు వెళ్లే దారిని జెసిబి తో పూడ్చి చేసేందుకు రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం విఫల యత్నం చేశారు. అయితే వందలాది మంది పేదలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని జెసిబిని అడ్డుపడ్డారు. తమ పట్ల ఎన్ని నిర్బంధాలను ప్రయోగించినా తాము ఇక్కడి నుంచి వెళ్లబోయేది లేదంటూ పేదల ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సత్యశ్రీ ,రాజశేఖర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక్కడున్న పేదలందరికీ న్యాయం జరిగేంత వరకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులకు చేతనైతే ఇక్కడే ప్రభుత్వ స్థలంలో పాగావేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న సిద్ధుల రవి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సవాలు విసిరారు. పేదలంటే అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకి లోకువయ్యారని, అందుకే ఇలా పేదలపై బల ప్రయోగాలకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.

➡️