టెన్త్‌ పరీక్షలపైనే ఫోకస్‌- ఉత్తమ ఫలితాలు సాధిస్తాం- సి. దేవరాజు, జిల్లా విద్యాశాఖాధికారి

టెన్త్‌ పరీక్షలపైనే ఫోకస్‌- ఉత్తమ ఫలితాలు సాధిస్తాం- సి. దేవరాజు, జిల్లా విద్యాశాఖాధికారి

టెన్త్‌ పరీక్షలపైనే ఫోకస్‌- ఉత్తమ ఫలితాలు సాధిస్తాం- సి. దేవరాజు, జిల్లా విద్యాశాఖాధికారిప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: జిల్లా విద్యాశాఖ మరో 12 రోజుల్లో ప్రారంభం కానున్న టెన్త్‌ పరీక్షల పైనే ఫోకస్‌ చేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో ఉత్తమ ఫతాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గతేడాది కంటే మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొచ్చిన మార్పులో విద్యార్థులో చదువుపట్ల ఆసక్తి పెరిగిందని, ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి సి. దేవరాజు అన్నారు. ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించామని వారు తెలిపారు. ప్రజాశక్తి అడిగిన పలు ప్రశ్నలకు డిఇవో సమాధానం ఇచ్చారు.. వారి మాటల్లోనే..ప్రశ్న: ఈ ఏడాది పది పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారా..? సమాధానం: ప్రణాళిక బద్ధంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేశారు. జనవరి నాటికీ సిలబస్‌ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. జనవరి నుండి పరీక్షలు ప్రారంభం నాటికి సిలబస్‌ రివిజన్‌ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలెన్ని ….? సమాధానం: ఉమ్మడి జిల్లాలో 4,803 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినివిద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న జగన్న అమ్మఒడి, గోరుముద్ద, జనన్న విద్యాదీవెన, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ జరుగుతోంది. ప్రశ్న: గతఏడాది పదో తరగతి ఉత్తీర్ణత ఎంత ? సమాధానం: గత ఏడాది అంటే 2022-23లో చిత్తూరు జిల్లాలో 69.53 శాతం, తిరుపతి జిల్లాలో 75.70 శాతం, అన్నమయ్య జిల్లాలో 69 శాతం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 64.78 శాతం, బాలికలు 74.65 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రశ్న: డిజిటల్‌ విద్య ఎలా సాగుతోంది? సమాధానం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం డిజిటల్‌ విద్యకు శ్రీకారం చుట్టింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూన్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లను పంపిణీ చేశారు. జిల్లాలో 38,338 మంది 8వ తరగతి విద్యార్థులకు, 6,592 మంది ఉపాధ్యాయులకు ఉచిత ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ప్రశ్న: ఉన్నత పాఠశాలలు జూనియర్‌ కళాశాల లుగా ఎన్ని మారాయి? సమాధానం: ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో 20 ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా మార్చింది. ఈ కళాశాలల్లో ఎంపిసి, బైపిసి, సిఈసి కోర్సును బోధిస్తున్నారు.

➡️