నగరికి పర్యాటక ‘శోభ’ మంత్రి రోజా చొరవతో మంజూరైన శిల్పారామం

నగరికి పర్యాటక 'శోభ' మంత్రి రోజా చొరవతో మంజూరైన శిల్పారామం

నగరికి పర్యాటక ‘శోభ’ శ్రీ మంత్రి రోజా చొరవతో మంజూరైన శిల్పారామం శ్రీ మండలంలోని తడుకు వద్ద పూర్తయిన భూసేకరణ శ్రీ నియోజకవర్గ అభివృద్ధి పెంపుప్రజాశక్తి – చిత్తూరు డెస్క్‌: నగరికి పర్యాటక రంగానికి శోభ చేకూరనుంది. ఇప్పటికే ప్రమాణాలు పెంచుకుంటూ అభివద్ధి పథంలో నడుస్తున్న నగరి నియోజకవర్గానికి ‘శిల్పారామం’ రూపంలో అదనపు అందం చేకూరనుంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కేరోజా సూచనల మేరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఏపీ శిల్పారామం సొసైటీ, విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్‌కు అందిన లేఖ అందడంతో ఆయన భూముల కేటాయించేందుకు భూసేకరణ చేయాలంటూ ఆర్డీవోకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు నగరి మండలం తడుకు గ్రామంలోని సర్వే నెంబరు 92/1,2, 93/3, 94/2,3, 95/3,4 లోని 12 ఎకరాల స్థలాన్ని ‘శిల్పారామం’ ఏర్పాటుకు కేటాయించారు. భూముల కేటాయింపు పూర్తికావడంతో ఏపీ శిల్పారామం సొసైటీ వారు త్వరగా నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 శిల్పారామంలు ఉండగా కొత్తగా ఐదు శిల్పారామంలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇలా నగరిలో ఒక శిల్పారామం ఏర్పాటు కానుంది. ఇప్పటికే నియోజక వర్గంలో నాలుగు పార్కు లు ఏర్పాటైన విషయం విదితమే.. ఇవి స్థానికులకు ఆహ్లాదాన్ని పంచు తుండగా నూతనంగా ఏర్పాటు కానున్న శిల్పారామం పర్యాటక సింగారాన్ని చేకూర్చనుంది. మన సంస్కతి, సంప్రదాయాలకు సంబం ధిత కళాఖండాలు, శిలల పార్కు, పచ్చికబయళ్లు, తోటలు, రాక్‌ గార్డెన్‌, కలంకారీ వస్తువులు, బోటింగ్‌, పార్కు, చేనేత దుస్తులు, పింగాణి వస్తువుల అమ్మకాలు, పురాతన వస్తువుల ప్రదర్శన అంటూ శిల్పారామం నగరి ప్రజల ను అలరించనుంది. చేతివత్తి ద్వారా వస్తువులు తయరుచేసే వారికి శిల్పారామం వరప్రదాయని కానుంది.

➡️