నమ్మినందుకు…నడిరోడ్డుపై..!

Dec 22,2023 23:16
నమ్మినందుకు...నడిరోడ్డుపై..!

శ్రీ అంగన్‌వాడీల రాస్తారోకోలుప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం: వేతనాలు పెంపు, గ్రాట్యూటి అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అంగన్వాడీ యూనియన్స్‌ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సుజిని, బుజ్జి, సిఐటియు జిల్లా అధ్యక్షులు, చైతన్య, ఏఐటియుసి నాయకులు కే.ప్రభావతి, కే .అరుణ నాయకత్వం వహించారు. ప్రాజెక్టు కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని నాలుగున్నర సంవత్సరాల నుండి అనేక పర్యాయములు సంబంధిత అధికారులకు, మంత్రివర్యులకు తెలియజేసినప్పటికీ నేటికి వేతనాలు పెంచలేదని విమర్శించారు. చింతా ప్రతాప రెడ్డి నోటికి వచ్చిన విధంగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జిజెఎం ఛారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధి గురజాల చెన్నకేశవనాయుడు, టిడిపి నాయకులు సప్తగిరి ప్రసాద్‌లు మద్దతు తెలిపారు. శ్రీ వి.కోట ఎంఆర్‌ఒ కార్యాలయంఎదుట ప్రధాన రహదారిపై అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అధికారం చేపట్టిన తర్వాత గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.ప్రభుత్వం దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం అంటే అంగన్వాడి సిబ్బంది గుండెలను పగలగొట్టినట్లుగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. శ్రీ కార్వేటినగరం కూడలిలో ప్రాజెక్టు నాయకులు మమత, రాధమ్మ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య సంఘీభావం ప్రకటించారు. అంగన్‌వాడీలు చెంచులక్ష్మి, లక్ష్మి,నరసమ్మ, మంజుల, యువరాణి, ఉమ, సౌదామి పాల్గొన్నారు. శ్రీ శాంతిపురంలో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

➡️