నల్ల బ్యాడ్జీలతో నిరసన

Feb 14,2024 21:23
నల్ల బ్యాడ్జీలతో నిరసన

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లాలోని 675 తాలూకా కేంద్రాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు అందించడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారని బుధవారం ఏపి జేఏసి జిల్లా అధ్యక్షులు కెవి.రాఘవులు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు పరిష్కరించకుంటే జేఏసి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని ప్రభుతాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు.

➡️