నేటి నుండి పది పరీక్షలుశ్రీ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు శ్రీ పరీక్షలకు హాజరుకానున్న 22,594 మంది విద్యార్థులు

నేటి నుండి పది పరీక్షలుశ్రీ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు శ్రీ పరీక్షలకు హాజరుకానున్న 22,594 మంది విద్యార్థులు

నేటి నుండి పది పరీక్షలుశ్రీ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు శ్రీ పరీక్షలకు హాజరుకానున్న 22,594 మంది విద్యార్థులు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: సోమవారం నుండి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా 116 పరీక్షా కేంద్రాల్లో 22,594 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో విద్యార్థులు 11,767, విద్యార్థినులు 10,827 మంది ఉన్నారు. ఉదయం 9.30 గంగల నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం. పది పరీక్షలకు 22,119 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. గత సంవత్సరం ఫెయిల్‌ అయిన 1,395 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 6 బృందాలు పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ చోటు చేసుకోకుండా 6 ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 116 సిటింగ్‌ స్క్వాడ్‌, 1,096 మంది ఇన్విజిలేటర్లును నియమించారు. ఉదయం పరీక్ష సమయానికి ఒక గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. హాల్‌ టికెట్‌ను పరిశీలించుకోవడంతో పాటు ఇన్విజిలేటర్‌ ద్వారా హాల్‌ టికెట్‌ ఆధారంగా కేటాయించిన సీటు ముందుగా తెలుసుకోవాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు.. విద్యార్థులు ఎవరూ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర వస్తువులు పరీక్ష హాలుకు తీసుకు వెళ్లకూడదు. ప్రతి విద్యార్థి పరీక్ష సెంటర్‌ కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. తప్పని సరిగా విద్యార్థులు హాల్‌ టికెట్‌ ను సదరు ఆర్టీసీ వారికి చూపించాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణ సిబ్బంది, చీఫ్‌ సూపరింటెండెట్‌, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌, ఇన్విజిలేటర్‌, అటెండర్స్‌, స్వీపర్స్‌, వాటర్‌ బార్సు, పోలీస్‌ వారు ఎవరూ సెల్‌ ఫోన్లతో పరీక్ష హాలుకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చోటు చేసుకున్న పేపర్‌ లీకేజీ సంఘటలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఎలాంటి సంఘటనలూ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష హాలులో మాస్‌ కాపీయింగ్‌ కు వీలు లేకుండా ప్రశ్నా పత్రాలపై భార్‌ కోడ్‌ ను ముద్రించారు. ఎక్కడైనా ఇలాంటి లోపాలు తెలిసిన వెంటనే భార్‌ కోడ్‌ ద్వారా ఏ సెంటర్‌ లో ఏ రూమ్‌లో ఏ విద్యార్థి మాస్‌ కాపీయింగ్‌ కు పాల్పడుతున్నారో తెలిసిపోతుంది. ఏ సెంటర్లలోనైనా మాస్‌ కాపీయింగ్‌, ఇతర సమస్యలు తలెత్తితే ఏసీటి 25 ఆఫ్‌ 1997 శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా 116 పరీక్షా కేంద్రాల్లో ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించేలా జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 9032185001 ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

➡️