పోటీ తత్వంతో మేధో వికాసం: డిఇవో

పోటీ తత్వంతో మేధో వికాసం: డిఇవో

పోటీ తత్వంతో మేధో వికాసం: డిఇవో ప్రజాశక్తి- వెదురుకుప్పం: పోటీతత్వంతో మేధస్సు వికసిస్తుందని డిఇవో దేవరాజు పేర్కొన్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వెదురుకుప్పం హైస్కూల్‌ను డిఇవో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ పోటీ తత్వంతో మేధోవికాసానికి దోహదం చేస్తుందని అప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని పరిశోధనలతోనే వైజ్ఞానిక ప్రగతి మెరుగుపడుతుందని పరిశోధనలపై విద్యార్థులకు ఆసక్తి పెంచడం ఉపాధ్యాయుల కర్తవ్యం అని తెలిపారు. ఈ సందర్భంగా వెదురుకుప్పం హైస్కూలు విద్యార్థులను , ఉపాధ్యాయులను ఇన్‌స్పైర్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఇఎన్‌డిపిలో జిల్లా స్థాయిలో తతీయ ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక కావడంపై చాలా ఆనందంగా వుందన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులును మండల విద్యాశాఖ అధికారి మహేశ్వరను, ఉపాధ్యాయులను అభినందించారు.

➡️