ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ సహకారం- వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌

ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ సహకారం- వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా లాభసాటిగా చేసేందుకు క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో వివిధ శాఖలకు చెందిన వారిని ఉద్యోగులుగా నియమించి సలహాలు, సూచనలను ఇప్పిస్తామని తద్వారా నాణ్యమైన ఉత్పత్తులు పొందేందుకు వీలు ఉంటుందని, రైతులకు కార్యాలయాలు చుట్టూ తిరిగే పని లేకుండా చేశామని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ పి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఛైర్మన్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 29 మండలాల్లో మామిడి ప్రధాన పంటగా ఉంటుందని,ఇప్పటికే రానున్న మామిడి సీజన్‌ కు సంబంధించి ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన సమావేశాలను నిర్వహించామని మంచి ఉత్పత్తులు సాధించి తద్వారా ఎగుమతులు చేసి మంచి ధరలు పొందేలా అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా సాధిస్తున్న పంటలకు ఇప్పటికే మార్కెటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశామని, దీనిని మరింతగా విస్తత పరిచేలా ప్రభుత్వాన్ని కోరామన్నారు. జేసి పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఒక పద్ధతి ప్రకారం ఉత్పత్తులు సాధించేందుకు కష్టపడాలని అదేవిధంగా గిట్టుబాటు ధరలు వచ్చేంతవరకు అధికారుల సూచనల మేరకు యాజమాన్య పద్ధతులను పాటించడం తోపాటు కోత దశలో మరింత జాగ్రత్తగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో రాగి పంటకు మరింత అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను ఉపయోగించుకొని మంచి ఉత్పత్తులు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆదర్శ రైతుల సలహాలను కూడా రైతులకు చెప్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలదికారులను ఆదేశించారు. అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు మరింతగా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. పిఎంకె ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్‌ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్‌ ప్రభాకర్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏడి మార్కెటింగ్‌ పరమేశ్వర్‌, జిల్లా పట్టు పరిశ్రమ అధికారిని శోభారాణి, మైక్రో ఇరిగేషన్‌ అధికారి వెంకటరమణారెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ ఈ విజరు కుమార్‌ రెడ్డి, డ్వామా ఏపిడి ఉమాదేవి, శాస్త్రవేత్త రెడ్డి రాము సభ్యులు రత్నారెడ్డి, శివ ప్రకాష్‌ రాజు, జగదీశ్వర్‌ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు.

➡️