ప్రజాసమస్యలకు పరిష్కార వేదిక ‘స్పందన’

Jan 22,2024 22:50
ప్రజాసమస్యలకు పరిష్కార వేదిక 'స్పందన'

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్‌పి రిషాంత్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్‌పిని అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఎల్‌.సుధాకర్‌ ఎస్‌ఇబి అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరిత గతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు అందాయి. భూతగాదాలు 9, ఆస్తి తగాదాలు 3, కుటుంబ తగాదాలు 2, వేధింపులు 1 ఫిర్యాదు అందాయి.

➡️