ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే ధ్యేయం: ఎస్పీ

Feb 13,2024 22:07
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే ధ్యేయం: ఎస్పీ

జాషువాప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే ధ్యేయమని ఎస్పీ జాషువా అన్నారు. మంగళవారం రాష్ట్ర సరిహద్దు తడుకుపేట వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. తనిఖీలు ఎలా చేయాలో సిబ్బందికి నిశితంగా వివరించారు. ఆలసత్వం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అనుగుణంగా విస్తత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలను అడ్డుకట్ట వేసేలా ప్రణాళికలు రచించామన్నారు. అసాంఘిక శక్తుల కదలికపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు ఇప్పటికే పోలీస్‌శాఖ కనుసన్నల్లోకి తీసుకుందన్నారు. నిరంతర సోదాలు జరుగుతున్నాయన్నారు. ఒక్కొక్క చెక్‌పోస్టులో పటిష్ఠమైన సిబ్బందిని ఏర్పాటుచేశామని వారు మూడు షిప్టులు పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ గంగిరెడ్డి, సీఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ గంగాధర నెల్లూరు: మండల పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా నూతన ఎస్పీ జాషువా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు తెలియచేశారు. ప్రశాంత వాతావరణంలో రానున్న ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటినుంచే ప్రణాళికల రూపొందించాలని ఆదేశించారు. ఆయన వెంట చిత్తూరు పట్టణ డిఎస్పి రాజగోపాల్‌ రెడ్డి, సిఐలు గంగిరెడ్డి, శంకర్‌, ఎస్సై రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️