ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా..?

Dec 22,2023 23:25
ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా..?

వామపక్షాల నిరసనప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌: అత్యున్నత సభ పార్లమెంటు లో సభ జరుగుతుండగానే దుండగులు ప్రవేశించి పొగ బాంబు వేసి భయభ్రాంతులను చేసిన సంఘటనను సమావేశంలో చర్చించి హౌం మంత్రి అమిత్‌ షాను, ప్రధానమంత్రి మోడీని ప్రశ్నించినందుకు ఇండియా వేదిక విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కట్టమంచి చెరువు స్వామి వివే కానంద విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్‌, సిపిఐ జిల్లా కార్య దర్శి ఎస్‌.నాగరాజు, సిపిఎం నాయకులు బాలసుబ్ర మణ్యం మాట్లాడుతూ ప్రజా సమస్యలపైనా, పార్లమెంట్‌ భద్రతపైనా ప్రశ్నించినందుకు ఎంపిలను సస్పెండ్‌ చేశా రన్నారు. దేశంలోనే అత్యంత ఉన్నత సభను రక్షించలేని బిజెపి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. హౌం మంత్రి అమీత్‌ షా ,ప్రధానమంత్రి మోడీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు . విపక్ష పార్టీలకు సంబంధించిన 146 ఎంపీలను సస్పెండ్‌ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇండియా వేదిక విపక్ష పార్టీల 146 ఎంపీ ల అక్రమ సస్పెండ్‌ ను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గోవర్ధన రెడ్డి ,అర్‌ ఆర్‌ బాబు, కే నారాయణస్వామి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

➡️