ప్రైడే.. డ్రైడే తప్పక పాటించాలి

Jan 27,2024 22:24
ప్రైడే.. డ్రైడే తప్పక పాటించాలి

మలేరియా అధికారి శ్రీనివాసులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లా వైద్యఆరోగ్యశాఖ మలేరియా అధికారి శ్రీనివాసులు శనివారం నగర పరిధిలోని 47వ వార్డు సంతపేట కాలనీలో నిల్వ ఉన్న నీటిలో ఉన్న లార్వాలపై విస్తత తనిఖీ చేశారు. ఇండ్ల పరిసరాలలో నీరు నిలవలేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని తెలపాలన్నారు. బిందెలు, తొట్టెలు, డ్రమ్ములపై మూత లేకుంటే దోమల వృద్ధి చెంది డెంగీ, మలేరియా, వంటి విషజ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అన్నారు. కనుక ప్రజలందరూ ఫ్రైడే డ్రైడే తప్పక పాటించాలన్నారు. అంతేకాకుండా దోమతెరలు వాడాలని, పచ్చి వేపాకు పొగ వేసుకోవాలని, చంటి బిడ్డలకు వెచ్చటి దుస్తులు ధరించాలని, కాచి వడగట్టిన నీరు తాగాలని సూచించారు. ఎవరికైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్త్‌సెంటర్‌లోకానీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో కానీ రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. సబ్‌యూనిట్‌ అధికారులు పీరు సాహెబ్‌, రామకష్ణ, కోకిల హెల్త్‌ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️