బకాయిలు చెల్లిస్తారా.. బుకాయిస్తారా.!

Jan 27,2024 00:03
బకాయిలు చెల్లిస్తారా.. బుకాయిస్తారా.!

శ్రీ పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని యూటీఎఫ్‌ నేతల డిమాండ్‌శ్రీ చిత్తూరులో భారీ ర్యాలీ, నిరసనప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లిస్తారా.. లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ శుక్రవారం చిత్తూరులో యూటీఎఫ్‌ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. యూటీఎఫ్‌ కార్యాలయం నుంచి డీఈవో కార్యాలయం మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయిపడ్డ పిఎఫ్‌, ఏపిజిఎల్‌ఐ, సరెండర్‌ లీవు, పిఆర్‌సి, డిఏ బకాయిలు దాదాపు రూ.18,006కోట్లు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిత్తూరు కేంద్రంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. తామంతా నెలనెలా దాచుకోనే డబ్బులు చెల్లించడానికి తాత్సారం దేనికని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తక్షణమే ఆర్థిక చెల్లింపుతో పాటు, విద్యా వ్యవ్వస్థలలో ప్రశాంతమైన వాతావరణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమశేఖర నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మణిగండన్‌, నాయకులు సుధాకర రెడ్డి, పి.ఆర్‌.మునిరత్నం, కె.దీనావతి, రెడ్డెప్పనాయుడు, కష్ణమూర్తి, ఎస్‌.పి.బాషా, ఏకాంబరం, సరిత, సురేష్‌, పార్థసారధి, తదితరులు పాల్గొన్నారు. నగరి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్టీయూ ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు గాజుల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక పి.సి.ఎన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ, నగరి డివిజన్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సుబ్రమణ్యం, పవన్‌కుమార్‌ రెడ్డి, గంగామోహన్‌, మహేంద్రన్‌, గణేశన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️