రాజకీయాలు పక్కన పెట్టి.. పింఛన్లు అందించండి

Apr 2,2024 21:54
రాజకీయాలు పక్కన పెట్టి.. పింఛన్లు అందించండి

టిడిపి వినతులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాజకీయాలను పక్కనపెట్టి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆదుకునేందుకు తక్షణం వారికి పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌, టిడిపి నగర పార్టీ అధ్యక్షురాలు కటారి హేమలత, జిల్లా పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ మంగళవారం కమిషనర్‌ అరుణకు వినతిపత్రం అందించారు. వికోట: పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం రాజకీయం చేస్తూ టిడిపిపై బురద చల్లడం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందువలన ఎలక్షన్‌ కమిషన్‌ వాలంటరీ వ్యవస్థను ఎన్నికల విధుల్లోకి హాజరు కాకూడదని, పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఆదేశిస్తే అది టిడిపికి ఆపాదించడం అవివేకమని అన్నారు. వాలంటీర్లు కాకపోయినా సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్‌ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఎంపీడీవో గోవర్ధన్‌కు టిడిపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. మండల టిడిపి అధ్యక్షులు రంగనాథ్‌, రామచంద్ర నాయుడు, చౌడప్ప, రాంబాబు, ఈశ్వర్‌ గౌడ్‌, ధీరజ్‌, అయ్యాజ్‌ బాష, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. బంగారుపాళ్యం: ఇండ్ల వద్దకే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం ఎంపీడీవో శివశంకర్‌ పింఛన్ల పంపిణీ ఇండ్ల వద్ద చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. బీసీ నాయకులు నాగరాజు గౌడ్‌, మాధవ గౌడ్‌, దేవవాని, రమేష్‌ పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ పురం: ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లను తప్పించి సచివాలయ సిబ్బందిలతో పింఛన్ల పంపిణీ చేయాలని కోరుతూ టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్‌ నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బిజెపి కన్వీనర్‌ రాజేంద్రన్‌, అధ్యక్షుడు జల్లా జ్యోతిరెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో ఏవో కష్ణయ్యకి వినతి పత్రం అందించారు. గంగాధర నెల్లూరు: సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేయాలని,టిడిపి అధ్యక్షుడు స్వామిదాస్‌ ఆధ్వర్యంలో ఎంపీడీవో భాస్కర్‌కు టిడిపి, జనసేన నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. కష్ణమనాయుడు, శ్రీధర్‌ యాదవ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. రామకుప్పం: మండలంలో వద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ల పంపిణీలో చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు మండల కార్యాలయం వద్ద ఎంపీడీవో ఈశ్వరయ్యకు వినతిపత్రం అందజేశారు. ఆనంద రెడ్డి, మనస్వామి, ఆంజనేయ రెడ్డి, నరసింహులు, పట్రా నారాయణ, రామమూర్తి పాల్గొన్నారు.

➡️