రోడ్డు దాటడానికి ఒంటరి ఏనుగు తంటాలు సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులు

రోడ్డు దాటడానికి ఒంటరి ఏనుగు తంటాలు సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులు

రోడ్డు దాటడానికి ఒంటరి ఏనుగు తంటాలు సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులుప్రజాశక్తి – పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటా ఊరు వద్ద శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ ఒంటరి ఏనుగు రోడ్డు దాటడానికి తంటాలు పడింది. అటుగా వెళుతున్న వాహన దారులు ఏనుగును రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటే సెల్ఫీలు వీడియోలు తీశారు. చిత్తూరు నుండి పలమనేరు వెళ్లే వాహనాలు తాకిడి ఎక్కువగా ఉండడంతో ఏనుగు ఇటువైపు అటవీ ప్రాంతం నుండి అటువైపు వెళ్లడానికి ఎంతో యత్నించి చివరికి వాహనాలు అటూ ఇటూ ఎక్కువగా వెళుతుండడం వల్ల ఒంటరి ఏనుగు వెనుదిరిగింది. ఏనుగు రోడ్డుపై ఉన్నంతసేపు అటవీ అధికారులు అటువైపు రాలేదని, ఆహారం కోసం ఏనుగులు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి. అలాంటిది కనీసం ఒకరిద్దరు ట్రాకర్స్‌ అయినా పెట్టి గజరాజును రోడ్డు దాటించి ఉంటే బాగుండేదని చర్చించుకున్నారు.

➡️