లారీ దూసుకొచ్చి.. ఇళ్లు ధ్వంసం

Dec 17,2023 23:16
లారీ దూసుకొచ్చి.. ఇళ్లు ధ్వంసం

ప్రజాశక్తి-శాంతిపురం: మండల పరిధిలోని గుండిశెట్టిపల్లి గ్రామంలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో కుప్పం వైపు వస్తుండగా అదుపు తప్పి ఓ ఇంటిలోకి దుసుకొచ్చింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. స్థానికుల కథనం మేరకు.. గుండిశెట్టిపల్లి గ్రామ జాతీయ హైవే పక్కన సుమారు 50 అడుగుల దూరంలో బి.జయరాం నూతనంగా గహ నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు. కుప్పం వైపు ఇనుప వస్తువుల లోడుతో వస్తున్న ఈచర్‌ లారీ నడుపుతున్న డ్రైవర్‌ మితిమీరిన వేగంతో జాతీయ రహదారికి పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకొచ్చింది. అదష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేనందువల్ల ప్రాణాపాయం తప్పింది. ఇంటిలోని లోని విలువైన వస్తువులు గహం చాలా వరకు ధ్వంసం అయింది. ఘటన స్థలానికి చేరుకున్న రాళ్ళబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

➡️