విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Dec 19,2023 22:30
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ప్రజాశక్తి-యాదమరి: విద్యార్థులు సైన్స్‌ పట్ల అవగాహన పెంచుకొని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంఈవో రుక్మిణమ్మ తెలిపారు. మంగళవారం యాదమరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో లోతైన అధ్యయనం చేయాలని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు సైన్స్‌ ఆవశ్యకతపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు 67 నమూనాలు ప్రదర్శించారు. అత్యుత్తమ నమూనాలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. యాదమరి పాఠశాలకు చెందిన కార్తీక్‌కి మొదటి బహుమతి, రెండవది పి.గొల్లపల్లి పాఠశాలకు చెందిన దుర్గానాథ్‌కి, మూడవది కె.గొల్లపల్లి పాఠశాలకు చెందిన జి.కార్తీక్‌కి, గ్రూప్‌ ప్రదర్శల్లో మొదటి స్థానంలో వరిగపల్లె పాఠశాలకు, రెండవ స్థానంలో కె.గొల్లపల్లి ఉన్నత పాఠశాలకు, మూడవ బహుమతి డి.కె.చెరువు ఉన్నత పాఠశాలకు అందజేశారు. టీచర్స్‌ కేటగిరిలో షబ్బీర్‌, శ్రీ రంగలక్ష్మీ, పి.ప్రసన్నలకు ప్రసంశ పత్రాలను అందించారు. విజేతలను ఎంఈవో అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌, హెచ్‌ఎం గిరిరాజా, కనకాచారి, దామోదర రెడ్డి, కష్ణరెడ్డి, భాస్కరరెడ్డి, హిమబిందు, విజయకుమార్‌, కల్పలత, రాణి ఉన్నారు. పుంగనూరు: విద్యార్థులు వైజ్ఞానిక విషయాలపై ఆసక్తి కనబరిచి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంఈఓ చంద్రారెడ్డి ఆకాంక్షించారు. స్థానిక బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్‌ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్‌ యుగంలో పోటీపడి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. మండల స్థాయికి 60 నమూనాలు ప్రదర్శించగా వాటిలో కొన్ని నిపుణుల ద్వారా జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయి ప్రదర్శనకు మొదటి బహుమతిగా మున్సిపల్‌ హైస్కూల్‌ కొత్త ఇండ్లు విద్యార్థి హారిక-స్మోక్‌ అబ్జర్వర్‌ ప్రదర్శన, అలాగే ద్వితీయ బహుమతిగా ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి నాగసాయిరెడ్డి-హెల్త్‌ అండ్‌ టైప్స్‌ ఎంపిక, అలాగే తతీయ బహుమతిగా మేలు పట్ల హైస్కూల్‌ విద్యార్థి తరుణ్‌ నాయక్‌-ఎర్త్‌ క్వేక్‌ ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈవో ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ-2 రెడ్డప్పశెట్టి, పాఠశాల హెచ్‌ఎం వసుంధర తదితరులు పాల్గొన్నారు. బంగారుపాళ్యం: విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు చేపడుతున్నట్లు ఎంఈవో నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం హెచ్‌ఎం రాజేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల అవగాహన పెరిగిందన్నారు. వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలు ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేవారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చెంగల్‌రెడ్డి, పార్థసారథి, సైన్స్‌ ఉపాధ్యాయులు హరిబాబు, చంద్రశేఖర్‌, షంషేర్‌ఖాన్‌ పాల్గొన్నారు. సోమల: సోమల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మూడు ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్‌ నమూనాలను ప్రదర్శించారు. సోమల, సూరయ్యగారిపల్లి, నంజంపేట ఉన్నత పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నందు పలు నమూనాలను ప్రదర్శించగా ఎంఈఓ శివరత్నమ్మ అన్ని నమూనాలను తిలకించి విద్యార్థుల వద్ద నుండి ఆయా నమూనా పనిచేసే విధానం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు విద్యార్థులలో సజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్‌ ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

➡️